Header Banner

భక్తులకు అలర్ట్.. ఇకపై అలా రావొద్దు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ! క్యూలైన్‌లో ఉన్నవారికి..

  Tue Apr 22, 2025 15:05        Devotional

ఎండాకాలం సెలవుల కారణంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచనలు జారీ చేసింది. టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని, నిర్ణీత సమయానికి ముందే క్యూలైన్‌లోకి రావడం వల్ల రద్దీ పెరుగుతోందని టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భక్తులు సహకరించాలని కోరారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 1978,821 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, అదే రోజు హుండీ ఆదాయం రూ.3.36 కోట్లుగా నమోదైందని టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 20న ఈ సంఖ్య 82,746కు చేరింది, హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా ఉంది. ఈ రద్దీలో సర్వదర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. టీటీడీ భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్‌లో ఉన్నవారికి భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందిస్తోంది.

 

ఇది కూడా చదవండి: ‘థ్యాంక్యూ సీఎం సర్‌, లోకేశ్‌ అన్న’ అంటూ.. చిత్రపటానికి పాలాభిషేకం! ఎందుకు అంటే.!

 

అయినప్పటికీ, టైమ్ స్లాట్‌ను పాటించకపోవడం వల్ల క్యూలైన్‌లు అనవసరంగా నిండిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమస్యను నివారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా గంట లేదా రెండు గంటల్లో దర్శనం పూర్తయ్యేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా టైమ్ స్లాట్‌లను బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా రద్దీని సమర్థంగా నిర్వహించడంతో పాటు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది. ఐతే.. ఈ వారం రోజుల్లో తిరుమలకు వెళ్లేవారికి.. కొంత ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఆగ్నేయ ఆసియా నుంచి భారీ మేఘాలు.. ఏపీలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇవి రాయలసీమకు వస్తున్నాయి. రాయలసీమలో తిరుమల ఉంది కాబట్టి.. తిరుమలపై మేఘాలు బాగా ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడప్పుడూ వర్షాలు కూడా కురవవచ్చు. ఈ రోజు తిరుమలలో వర్షం పడే ఛాన్స్ లేదు.. కానీ మేఘాలు ఉంటాయి. ఇలా మేఘాలు ఉంటే.. భక్తులు కొంత రిలీఫ్‌గా ఫీలవుతారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

 

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #Bus